స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన తంగిరాల

NTR: చందర్లపాడు మండలం గుడిమెట్లలో శ్రీ ద్వారకా కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని వేద పండితుల ఆశీర్వచనం పొందారు. ఈ మహోత్సవం భక్తుల మనస్సులో ఆధ్యాత్మిక శాంతిని, సౌభాగ్యాన్ని నింపుతుందని అన్నారు. స్వామివారి దివ్య మంగళ స్వరూపం ఈ ప్రాంత ప్రజలకు సదా రక్షణగా నిలుస్తుందని అన్నారు.