అమరవీరులకు నివాళులర్పించిన కొండేటి శ్రీధర్

WGL: సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవంగా పురస్కరించుకుంటూ, ఆనాటి నిజాం పాలకుల, రజాకారుల నిరంకుశత్వానికి బలైన అమరవీరులను గుర్తుచేసుకుంటూ, గుండ్రంపల్లి గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 350 మంది అమరవీరులకు జోహార్లు సమర్పించి, వారి త్యాగాలను స్మరించుకున్నారు. కాగా, ఈ కార్యక్రమం నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రంపల్లి గ్రామంలో జరిపారు.