రేపు ఉద్యోగ మేళా!

HYD: యూసుఫ్ గూడలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మైక్రోస్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజేస్ (నిమ్స్మే)లో బుధవారం జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉదయం 10గంటల నుంచి 3గంటల వరకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్న నిరుద్యోగ యువతకు వృత్తి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ఈ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.