VIDEO: తణుకులో విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం
W.G: తణుకులో కొలువైన శ్రీ పార్వతి కపర్దీశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం నందీశ్వర స్వామి వారి విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వయంభుః ఆలయంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో మూడు రోజుల దీక్ష అనంతరం నందీశ్వర విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వంశపారంపర్య ధర్మకర్త నల్లజర్ల వెంకన్న కుటుంబ సభ్యులు పూజల్లో పాల్గొన్నారు.