'అమిత్ షా మంత్రి పదవికి రాజీనామా చేయాలి'

కృష్ణా: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్‌ను అవమానపరిచేలా మాట్లాడిన కేంద్రమంత్రి అమిత్ షా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని సీపీఎం సీనియర్ నాయకులు వాకా రామచంద్ర డిమాండ్ చేశారు. సోమవారం వారు ఘంటసాల మండలం ఘంటసాలపాలెంలో సీపీఎం ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.