'కలెక్టరేట్ వద్ద ధర్నాను జయప్రదం చేయండి'

'కలెక్టరేట్ వద్ద ధర్నాను జయప్రదం చేయండి'

WG: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల అమలు, సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 6న కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మండా సూరిబాబు పిలుపునిచ్చారు. బుధవారం కాళ్లలో దీనికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న గుర్తింపు కార్డుల రెన్యువల్ ప్రక్రియ వెంటనే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.