వృధాగా మారిన రైతు వేదిక రూమ్

వృధాగా మారిన రైతు వేదిక రూమ్

KMR: గత ప్రభుత్వంలో నిర్మించిన రైతు వేదికలు చాలా వృధాగా ఉన్నట్లు రైతులుఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాంధారి మండలంలోని గురజాల గ్రామంలో ఊరికి దూరాన నిర్మించిన రైతు వేదిక సంబంధించి ఒక రూము పూర్తిగా నిరుపయోగంగా, దర్వాజను దొంగలు తీసుకెళ్లారు. అలాగే కిటికీ అద్దాలు సైతం పగలగొట్టడం జరిగింది . రైతు వేదికలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని రైతులు కోరుతున్నారు.