స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న కలెక్టర్

అన్నమయ్య: కలకడ మండల కేంద్రంలో శనివారం జరిగిన స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర ర్యాలీలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పాల్గొన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలన్నారు. జాతీయ రహదారిపై నిలిచి ఉన్న మురుగు నీటిని పరిశీలించి నీటిని తక్షణమే తొలగించాలన్నారు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.