ప్రభుత్వ విప్‌ను కలిసిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్

ప్రభుత్వ విప్‌ను కలిసిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్

SRCL: చందుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్‌గా నియమితులైన గుడిసె విజయ్ గురువారం ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. విజయ్ ఇటీవలే చందుర్తి తెలంగాణ బ్యాంకు బాధ్యతలు చేపట్టారు. రైతులకు సకాలంలో వ్యవసాయ రుణాలు ఇవ్వాలని, బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు.