భూపాలపల్లిలో ‘ఉమెన్ బ్లూ కోల్ట్’ కార్యక్రమం ప్రారంభం

BHPL: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కిరణ్ ఖరే మహిళల రక్షణ కోసం ‘ఉమెన్ బ్లూ కోల్ట్’ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. మహిళా పోలీసు సిబ్బందికి ప్రత్యేక స్కూటీలను అందజేసి, జెండా ఊపి స్కూటీ ర్యాలీని ఆరంభించారు. భూపాలపల్లి, కాటారం పోలీస్ స్టేషన్లు, షీ టీమ్స్ నుంచి ఎంపికైన మహిళా సిబ్బందికి ఈ వాహనాలు కేటాయించారు.