సర్పంచ్‌లకు ఘనంగా వీడ్కోలు

సర్పంచ్‌లకు ఘనంగా వీడ్కోలు

AKP: సర్పంచులకు వచ్చేనెల 2వ తేదీతో పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో సోమవారం కోటవురట్ల మండల సర్వసభ్య సమావేశంలో వీడ్కోలు పలికారు. సర్పంచ్‌లను సత్కరించి వారు చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ అప్పలనాయుడు, వైస్ ఎంపీపీ దత్తుడు సీతబాబు జడ్పీటీసీ ఉమాదేవి, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, మండల టీడీపీ అధ్యక్షుడు లింగన్నాయుడు పాల్గొన్నారు.