VIDEO: పాలమూరు హక్కుల రక్షణే మా లక్ష్యం: మంత్రి
HYD: పాలమూరు నీటి హక్కులను కాపాడుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన తప్పులను ఏపీ అలుసుగా తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.