రేపు అబ్బని కుంటలో ఉమ్మడి జిల్లా పత్తి రైతు సదస్సు
వరంగల్ జిల్లా కేంద్రంలోని అబ్బని కుంటలో రేపు సోమవారం పత్తి రైతుల ఉమ్మడి జిల్లా సదస్సును ఏర్పాటు చేశారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. పత్తి ఆధారిత పరిశ్రమల ఏర్పాటు గిట్టుబాటు ధర తదితర అంశాలపై రైతు సంఘాల నాయకులు సమగ్రంగా చర్చించనున్నట్లు ప్రకటించారు.