గన్ మిస్సింగ్.. SIపై కేసు

గన్ మిస్సింగ్.. SIపై కేసు

TG: హైదరాబాద్ అంబర్‌పేట్ SI గన్ మిస్ అయింది. ఓ కేసులో రికవరీ చేసిన బంగారంతో పాటు క్రైమ్ బ్రాంచ్ SI భానుప్రకాశ్ గన్ కనిపించట్లేదు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో డబ్బుల కోసం అతనే తాకట్టుపెట్టాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈక్రమంలోనే SI భానుప్రకాశ్‌పై కేసు నమోదు చేసి టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతణ్ని విచారిస్తున్నారు.