ట్రస్ట్ సహకారంతో రూ.లక్ష చెక్ అందజేత

ట్రస్ట్ సహకారంతో రూ.లక్ష చెక్  అందజేత

NLR: బుచ్చి మండలానికి చెందిన దొడ్ల వారి కుటుంబం మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి దొడ్ల వరదారెడ్డి రుక్మిణమ్మ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో దొడ్ల కోదండరామిరెడ్డి ఇన్వెర్టర్ కోసం రూ.లక్ష చెక్‌ను వైద్య అధికారి పద్మజాకు అందజేశారు. ఈ సందర్భంగా వైద్య అధికారి వారికి ధన్యవాదాలు తెలిపారు.