టీ స్టాల్ దుకాణానికి రూ.2 వేల జరిమానా..!
SDPT: హుస్నాబాద్ పట్టణంలోని మల్లె చెట్టు చౌరస్తాలో ఓటీ స్టాల్ యజమాని బహిరంగంగా చెత్త వేయడం, స్టీల్ గ్లాసులకు బదులుగా పేపర్ కప్పులు వాడినందుకు మున్సిపల్ కమిషనర్ టీ.మల్లికార్జున్ రూ.2 వేలు జరిమానా విధించారు. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది జరిమాన పత్రాన్ని అందజేశారు. నియమ నిబంధనలు పాటించని దుకాణాలపై చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు.