'బీజెపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి'
JGL: స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు యాదగిరి బాబు అన్నారు. రాయికల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను గ్రామస్థులకు వివరించాలని అన్నారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి నూతన వెలుగుకు శ్రీకారం చుట్టాలన్నారు.