ముదిరెడ్డిపల్లిలో వైభవంగా నాగుల ప్రతిష్టా కార్యక్రమం
SS: హిందూపురం పట్టణం ముదిరెడ్డిపల్లి డ్వాక్రా కాలనీలో నాగుల ప్రతిష్ట కార్యక్రమం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం వైభవంగా నిర్వహించారు. వేదపండితులు నాగుల విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట చేసి స్వామి విగ్రహాలకు అర్చన అభిషేకాలు చేశారు. అనంతరం మహా మంగళారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ డీఈ రమేశ్ కుమార్ పాల్గొన్నారు.