'కౌమార బాలికలకు అవగాహన కార్యక్రమం'
JGL: జిల్లాలో “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యక్రమం)”లో భాగంగా ఐడీఒసీ కేంద్రంలో కౌమార బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైద్యులు టీనేజ్ గర్భధారణ ప్రమాదాలు, పోషకాహార లోపం, మానసిక ఒత్తిడి ప్రభావాలను వివరించారు. ఈ మేరకు పోలీస్ అధికారులు సోషల్ మీడియా మోసాలపై హెచ్చరించారు.