ఇద్దరి పిల్లలకు విషమిచ్చి ఆపై తల్లి ఆత్మహత్య

ఇద్దరి పిల్లలకు విషమిచ్చి ఆపై తల్లి ఆత్మహత్య

SRD: కంది మండలం జులకల్ గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి ఆపై తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురూ ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లి ఈ దారుణ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.