'పందుల బెడద నుంచి పంటలను కాపాడాలి'
KDP: పులివెందులలో రబీ సీజన్లో సాగు చేసిన శనగ పంటను పందులు నాశనం చేస్తున్నాయి. వారం రోజుల క్రితం మున్సిపల్ కమిషనర్ పందుల యజమానులకు పందులు లేకుండా చూడాలని సూచించినా, వారు పట్టించుకోలేదు. దీంతో పందులు పట్టణ సమీపంలోని శనగ పంటను ధ్వంసం చేస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పందుల బెడద నుంచి తమ పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.