ఆలయానికి రూ. 2.50 కోట్ల ఆభరణాలు అందించిన జగ్గారెడ్డి కుటుంబం
SRD: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కుటుంబం దైవ భక్తిని చాటుకున్నారు. సంగారెడ్డి పట్టణంలో రామ్ మందిర్ ఆలయానికి రూ.2.50 కోట్ల విలువ చేసే అభరణాలను జగ్గారెడ్డి కుటుంబ సభ్యులు సమర్పించారు. శ్రీ రామ నవమి సందర్బంగా జగ్గారెడ్డి, నిర్మల దంపతులు కూతురు, కొడుకుతో కలిసి వేద మంత్రోచ్ఛరణల మధ్య ఊరేగింపుగా వారి ఇంటి వద్ద నుంచి ఆభరణాలు తీసుకుని వెళ్లి ఇవాళ ఆలయంలో సమర్పించారు.