VIDEO: బైక్‌లో చెలరేగిన మంటలు

VIDEO: బైక్‌లో చెలరేగిన మంటలు

HYD: బైక్‌లో మంటలు చెలరేగిన ఘటన ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిన్న రాత్రి  ఆసిఫ్ నగర్ సమీపంలో ఉన్న నయారా పెట్రోల్ బంకులో ఇంధనం నింపుకున్న వెంటనే బజాజ్ పల్సర్ బైక్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన బైక్ రైడర్ వెంటనే బైక్‌పై నుంచి దిగడంతో ప్రమాదం తప్పింది. మంటలు వేగంగా వ్యాపించడంతో బైక్ పూర్తిగా దగ్దమైంది.