పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై ఎస్సై పరిశీలన

పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై ఎస్సై పరిశీలన

ప్రకాశం: హనుమంతునిపాడు జడ్పీహెచ్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆదివారం ఎస్సై మాధవరావు సందర్శించారు. పాఠశాల ఉపాధ్యాయుడితో మాట్లాడి పరీక్షల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్‌ శాఖ నుంచి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.