సంతల ద్వారా రూ.4.21 లక్షల ఆదాయం

సంతల ద్వారా రూ.4.21 లక్షల ఆదాయం

ATP: అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఈ వారం జరిగిన పశువులు, జీవాల సంతల ద్వారా రూ.4.21 లక్షలకు పైగా ఆదాయం లభించినట్లు ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి తెలిపారు. అందులో శనివారం జరిగిన గొర్రెలు, మేకలు, పొట్టేళ్ల సంత నుంచి రూ.2.63 లక్షలు, ఆదివారం జరిగిన ఆవులు, ఎద్దులు సంత ద్వారా రూ.1.58 లక్షలు మేర వసూలైనట్లు వెల్లడించారు.