కారు ఢీకొని మహిళ మృతి
సిరిసిల్ల: కారు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన తంగళ్ళపల్లిలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మహిళను కారు టైర్ పగిలి అదుపుతప్పి ఢీకొట్టడంతో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. హుటాహుటిన ఆమెను కరీంనగర్ ఆసుపత్రి తరలిస్తుండగా మృతి చెందింది. కారు డ్రైవర్‌కు కూడా గాయాలు అయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.