ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

NZB: ధర్పల్లి మండల కేంద్రంలో నూతనంగా నెల కొల్పుతున్న ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు ధర్పల్లిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 30 పడకల స్థాయి నుంచి 100 పడకల ఆసుపత్రికి పెంచుతూ ఏరియా ఆసుపత్రిగా ప్రభుత్వం ఆప్ గ్రేడ్ చేసింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు.