పోలీస్ స్టేషన్‌లో ముందస్తు రక్షాబంధన్ వేడుకలు

NLR: నెల్లూరులోని దర్గామిట్ట పోలీస్ స్టేషన్‌లో బీబేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు సుభాషిని ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. సీఐ రోశయ్యతో పాటు సిబ్బందికి వారు రాఖీలు కట్టి స్వీట్ అందజేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు విశేష కృషి చేస్తున్న పోలీసులకు రాఖీ కట్టడం సంతోషంగా ఉందన్నారు. ఆడపడుచులకు పోలీసులు సోదరులు లాగా రక్షణగా ఉంటున్నారని వారు కొనియాడారు.