లింగ వివక్ష నిర్మూలనకు నెల రోజుల జాతీయ ప్రచారం: జేసీ
సత్యసాయి జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి డిసెంబర్ 23 వరకు లింగవివక్ష నిర్మూలనకై నెలపాటు జాతీయ ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. లింగ సమానత్వం, మహిళల ఆర్థిక శక్తివంతత, భద్రత, గృహ పనుల్లో భాగస్వామ్యం వంటి అంశాలపై నాలుగు థీమ్ వారాలుగా ఈ ప్రచారం జరుగుతుందని జేసీ తెలిపారు.