‘డబుల్ సెంచరీ చేసినా నాన్న సంతోషించరు’

‘డబుల్ సెంచరీ చేసినా నాన్న సంతోషించరు’

భారత యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో యూఏఈపై కేవలం 32 బంతుల్లోనే సెంచరీ చేసి వార్తల్లో నిలిచాడు. బీసీసీఐ ఇంటర్వ్యూలో వైభవ్ మాట్లాడుతూ తన తల్లిదండ్రుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నేను డబుల్ సెంచరీ చేసినా నాన్న ఇంకో 10 పరుగులు చేసి ఉండాల్సింది అంటారు. కానీ అమ్మ మాత్రం సెంచరీ చేసినా, డకౌట్ అయినా సంతోషంగా ఉంటుంది' అని చెప్పాడు.