VIDEO: 'వెంకటేశ్వరపురంలో బ్యాంకు ఏర్పాటు చేయండి'
NLR: నెల్లూరు సిటీ పరిధిలోని 53, 54వ డివిజన్లో నివసిస్తున్న ప్రజల కోసం ప్రభుత్వ బ్యాంకును ఏర్పాటు చేయాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వ బ్యాంకు లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పనులు మానుకొని సిటీలోకి రావాల్సి వస్తుందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయనకు వినతిపత్రం అందజేశారు.