సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కరీంనగర్ నియోజకవర్గానికి చెందిన 197 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి మంజూరైన చెక్కులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పంపిణీ చేశారు. నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు రూ. 41,39,500 విలువ గల చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు. ఆపద కాలంలో వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం అందిస్తుందన్నారు.