మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే
CTR: పార్కిన్‌సన్ వ్యాధితో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్వేటినగరం మండలానికి చెందిన సుధాకర్ రాజు కుటుంబానికి గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వి.ఎం. థామస్ వెంటనే స్పందించారు. సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం గమనించిన ఆయన, తన పీఏ ద్వారా కుటుంబాన్ని పరామర్శించి, ఫోన్‌లో మాట్లాడి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.15,000 ఆర్థిక సహాయం అందించారు.