గేటెడ్ కమ్యూనిటీలో అన్ని వసతులు కల్పించాలి: కేఎల్‌ఆర్

గేటెడ్ కమ్యూనిటీలో అన్ని వసతులు కల్పించాలి: కేఎల్‌ఆర్

RR: గేటెడ్ కమ్యూనిటీల్లో అన్ని వసతులు కల్పించాల్సిన బాధ్యత బిల్డర్ దేనని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. తుక్కుగూడ డివిజన్ ప్యాబ్ సిటీలోని విశాల్ సంజీవని విల్లాస్‌లో ఆయన ఇవాళ పర్యటించారు. కాలనీవాసులు పలు సమస్యలు కేఎల్‌ఆర్ దృష్టికి తీసుకువచ్చారు. విల్లాస్‌లో జరిగే పనులను పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు.