ఘనంగా రేణుక ఎల్లమ్మ దేవాలయ వార్షికోత్సవం

SRD: కంది మండలం ఇంద్రకరణ్ గ్రామంలో రేణుక ఎల్లమ్మ దేవాలయం తృతీయ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. అర్చకులు అమ్మవారికి మహా పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు బోనాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో రేణుక ఎల్లమ్మను దర్శించుకున్నారు.