చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి

NLR: రంజాన్ పండుగను అందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి కోరారు. మనుబోలు మండలం అక్కంపేటలో మైనార్టీ నాయకుడు షేక్ అమీర్ బాషా ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సోమిరెడ్డి పాల్గొని, పేద మహిళలకు చీరలు పంపిణి చేశారు. ఈ సందర్భంగా అమీర్ బాషాను ఎమ్మెల్యే సోమిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.