రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
W.G: భీమవరంలోని ఉండి రోడ్డు రైల్వే గేటు వద్ద సోమవారం రాత్రి రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. పట్టాలు దాటుతుండగా గుంటూరు ఫాస్ట్ ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. అతడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.