ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి

ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం‌తో పాటు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య ఇవాళ ఆకస్మికంగా సందర్శించారు. మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ సమీక్ష సమావేశంలో కలెక్టర్‌కు పలువురు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అప్పయ్య తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు.