గురుకుల పాఠశాలకు పీఎంశ్రీ ఉత్తమ పురస్కారం

W.G: పెదతాడేపల్లిలోని అంబేద్కర్ గురుకుల పాఠశాల జిల్లా స్థాయిలో ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (PM SHRI) ఉత్తమ పాఠశాలగా ఎంపికైంది. ఈ సందర్భంగా నిన్న పాఠశాలను కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, సుకాంత్ మజుందార్, జయంత్ చౌదరి, శ్రీనివాస్ వర్మ, MLA బొలిశెట్టి శ్రీనివాస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేశారని ప్రిన్సిపల్ రాజారావు వెల్లడించారు.