'ఎండాకాలంలో అప్రమత్తంగా ఉండాలి'
NRML: జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. సాధారణ స్థాయికి మించి 1.5°C నుండి 3.5°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నదని, వచ్చే వారం రోజుల పాటు వేడి గాలులు (హీట్‌వేవ్) ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని అమె తెలిపారు.