చేప పిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే
RR: కొత్తూరు మండలంలోని సాయిరెడ్డి చెరువులో ఇవాళ షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 30 వేల చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారుల అభ్యున్నతికి కృషి చేస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ముదిరాజ్ బిడ్డలను మత్స్య సహకార శాఖకు మంత్రిగా నియమించారని ఎమ్మెల్యే గుర్తు చేశారు.