'గుంతలు పూడ్చి ప్రాణాలు కాపాడుదాం'
MDK: నిజాంపేట మండలం జడ్చెరువు తండా రోడ్డులోని ప్రమాదకర గుంతలను ఎస్సై, సర్పంచ్ ఆధ్వర్యంలో ఇవాళ పూడ్చివేశారు. గతంలో ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందడంతో పోలీసులు ఈ చర్య చేపట్టారు. ప్రమాదాల నివారణకు ప్రజలు కూడా స్వచ్ఛందంగా తమ గ్రామాల పరిధిలోని రోడ్డు గుంతలను పూడ్చుకోవాలని ఎస్సై కోరారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ప్రాణనష్టం నివారించాలన్నారు.