మిల్క్ డైరీలో చోరీ.. రూ.లక్ష నష్టం

మిల్క్ డైరీలో చోరీ.. రూ.లక్ష నష్టం

GNTR: మంగళగిరి సరోజినీ మిల్క్ డైరీలో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దుకాణ యజమాని టీ. శైలజ సమాచారం ప్రకారం.. రాత్రి 10:30కి దుకాణం మూసి, సోమవారం తెల్లవారుజామున 4గంటలకు పాలను విక్రయించేందుకు వచ్చినప్పుడు షట్టర్ పగలగొట్టి కనిపించింది. లోపల పరిశీలించగా, గల్లాపెట్టెలో ఉన్న రూ.20వేల నగదు, రూ.80వేల విలువైన బంగారు, వెండి వస్తువులు చోరీ చేసినట్లు గుర్తించారు.