'ప్రతి ఒక్కరికి కరాటే అవసరం'
SRCL: నేటి సమాజంలో ఆత్మరక్షణ ప్రతి ఒక్కరికీ కరాటే అత్యవసరమైందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని మహా లింగేశ్వర గార్డెన్‌లో ఒకినావా స్పోర్ట్స్ కరాటే అకాడమీ 35 వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కరాటే కేవలం పోరాట విద్య మాత్రమే కాకుండా శారీరక దృఢత్వం, మానసిక సైర్యం, ఏకాగ్రతను పెంచుతుందన్నారు.