బ్రాహ్మణ అవమాన పాటపై ఫిర్యాదు
MDK: బ్రాహ్మణుల ప్రతిష్టను దెబ్బతీసేలా పాట పాడిన జి.డి. సారయ్య బృందంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. జిల్లా బ్రాహ్మణ సంఘం నాయకులు మంగళవారం ఎస్పీ శ్రీనివాస్ రావుకు ఫిర్యాదు చేశారు. యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన ఆ పాటను వెంటనే తొలగించాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్ శర్మ, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ శర్మ కోరారు.