ADB: టెన్షన్ లో ఉన్న ఓడిన అభ్యర్థులు..!
ADB: ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ, సిరికొండ, ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ మండలాల్లో ఇటీవల తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. పలువురు ప్రధాన అభ్యర్థులు జోరుగా ప్రచారం చేసినప్పటికీ విజయం దక్కలేదు. అప్పులు తీసి ఓట్ల కోసం డబ్బులు పంచి ఓడిన అభ్యర్థులు నిరాశలో ఉన్నారు. అప్పులు చేసినా గెలవలేకపోయామంటూ వాపోతున్నారు.