యువకుడిపై కత్తితో ముగ్గురు వ్యక్తులు దాడి

VZM: ఎస్.కోటలో టీ దుకాణం నిర్వహిస్తున్న వెన్నల రాజేష్(28) అనే యువకుడిపై శుక్రవారం ఉదయం గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. టీ దుకాణం తెరిచేందుకు వెళ్తున్న అతడిపై బైక్‌పై వచ్చిన దుండగులు అడ్డగించి కత్తితో దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్వల్ప గాయాలతో తప్పించుకున్న రాజేష్‌ను ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనపై PSలో ఫిర్యాదు చేసినట్లు పేర్కన్నారు.