సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

AP: పల్నాడు జిల్లాలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. నాదెండ్ల మండలం గణపవరం వద్ద జిన్నింగ్ మిల్లులో మార్కెట్ యార్డ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, కలెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీసీఐ నిబంధనలు కొద్దిగా సడలించి రైతుల వద్ద పత్తి మొత్తం కొనుగోలు చేయాలని సూచించారు.