VIDEO: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: శ్రీరాములు
సత్యసాయి: పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని ఇస్లాపురంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను శనివారం పంపిణీ చేశారు. మార్చి 1 ఆదివారం కావున ఒకరోజు ముందే టీడీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. టీడీపీ కన్వీనర్ శ్రీరాములు మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.