జనగామ జిల్లా కేంద్రంలో అకాల వర్షం
జనగామ జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఆకాశం ఒకసారిగా పూర్తిగా మబ్బులు కమ్ముకొని వర్షం పడటం ప్రారంభమైంది. ఆకస్మాత్తుగా వాతావరణ మారిపోయి వర్షం పడుతుండడంతో సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. చిరు వ్యాపారులు, బాటసారిలు అనేక ఇబ్బందులు పడ్డారు.